ప్రజాశక్తి – నిజాంపట్నం: రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు మంగళవారం ర్యాలీ నిర్వహించారు. జిల్లా పరిషత ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శివన్నారాయణ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీ పంచాయతీ కార్యాలయం మీదుగా ఎంపిడిఒ కార్యాలయం వరకూ నిర్వహించారు. అక్కడ మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బి. ప్రసాద్ రామకష్ణ , ఉమ మహేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.