విద్యార్థులు క్రీడలలోనూ రాణించాలి: ఎమ్మెల్యే బీఎన్‌

ప్రజాశక్తి-సంతనూతలపాడు: మండలంలోని పేర్నమిట్ట జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో జిల్లా స్థాయి వాలీబాల్‌ టోర్నమెంట్‌ను సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్‌ విజరుకుమార్‌ సోమవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ విద్యతోపాటు క్రీడలలో విద్యార్థులు ముందుండాలని అన్నారు. ప్రతి విద్యార్థి బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన సమన్వయకర్త కందుకూరు వెంకటేశ్వరరావు (బాబు), విద్యా కమిటీ చైర్మన్‌ శ్రీలత, ఎంఈఓ డి వెంకారెడ్డి, సరస్వతి కాలేజీ చైర్మన్‌ రమణారెడ్డి, నాయకులు కరిచేటి శ్రీనివాసరావు, వివరం గోవిందు, వాసేపల్లి వెంకటేశ్వరరెడ్డి, ఈదర విష్ణు, పేర్నమిట్ట పవన్‌, తన్నీరు వెంకట్రావు, పత్తిపాటి శ్రీనివాసరావు, కైలా శ్రీనివాసరావు, టిడిపి జనసేన నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️