ప్రజాశక్తి-పెద్దదోర్నాల: విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని టీడీపీ నియో జకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. సోమవారం పెద్దదోర్నాల లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శిక్షా సప్తాహ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లానడారు. కూటమి ప్రభుత్వంలో విద్యకు పెద్దపీట వేసినట్లు చెప్పారు. అనంతరం విద్యార్థులకు జనసేన మండల కన్వీనర్ మురళి ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన విందు భోజనాన్ని అందజేశారు. ప్రధానోపాధ్యాయుడు నారాయణ రెడ్డి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఎంఈవో మస్తాన్ నాయక్, టీడీపీ మం డల కన్వీనర్ ఏరువ మల్లికార్జునరెడ్డి, జనసేన మండల కన్వీనర్ మురళి, నాయకులు సుధాకర్‌రెడ్డి, మాబు, చెన్నారెడ్డి, సుబ్బారెడ్డి, శ్రీనివాస యాదవ్, బాషా పాల్గొన్నారు.
