ప్రజాశక్తి-కడప అర్బన్ విద్యార్థి దశలో గొప్ప వారి చరిత్రలు చదివి వారి ఆదర్శనీయమైన ఆలోచనలను జీవితానికి అన్వయించుకొని అనుసరించాలని యోగి వేమన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.పద్మ అన్నారు. వైవీయూ లలిత కళల శాఖలో కందుకూరి వీరేశలింగం జయంతి సందఠంగా ‘నాటక రంగ దినోత్సవం’ బుధవారం నిర్వహించారు. కందుకూరి చిత్రపటానికి వైవీయూ రిజిస్ట్రార్ పి.పద్మ, డీన్ కె.గంగయ్య, శాఖ హెడ్ కె.మ త్యుంజయరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పద్మ మాట్లాడుతూ కందుకూరి వీరేశలింగం బాల్య వివాహాలను నిషేధించడం, వితంతు వివాహాలను ప్రోత్సహించడంతో పాటూ బాలికల విద్య కోసం కషి చేసిన మహానుభావుడని వివరించారు. నాటక రంగానికి ఆయన చేసిన కషి గొప్పదని, మొట్టమొదటి తెలుగు నవల రాజశేఖర్ చరిత్ర ఆయన రాసినదేనన్నారు. నాటకాలు సంస్క తికి గుర్తులని నటులను సన్మానించుకోవడం సంస్కతిని కాపాడుకోవడమేనన్నారు. హిస్టరీ అండ్ ఆర్కియాలజీ ప్రొఫెసర్, ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ డీన్ ప్రొఫెసర్ కె.గంగయ్య మాట్లాడుతూ దేశ సంస్కతిని కాపాడేవీ నాటకాలేనని తెలిపారు. భారతదేశంలో సంఘసంస్కర్తలు వారి ఆదర్శనీయమైన జీవితాలను గుర్తుకు తెచ్చారు. ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్ హెచ్‌ఒడి డాక్టర్ మత్యుంజయరావు మాట్లాడుతూ నాటకాలు సమాజాన్ని ప్రభావితం చేస్తాయని ఒక మంచి మార్గంలో మనల్ని తీసుకు వెళ్తాయని తెలిపారు. ఫైనార్ట్ శాఖకు అధికారులు అందిస్తున్న సహకారం వల్లనే శాఖ అభివ ద్ధి జరుగుతోందన్నారు. అనంతరం నాటక రంగంలో అనేక నంది అవార్డులు, హంస అవార్డులు, కందుకూరి పురస్కారాలు అందుకున్న రంగస్థల కళాకారులు, నటులు అయిన కొడవలూరు చంద్రశేఖర్ రాజు, ఎడవల్లి కృష్ణమూర్తి, పి.యశోద, డాక్టర్ నీలం బాలగంగాధర్ తిలక్ ను ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమాన్ని లలిత కళల శాఖ అధ్యాపకులు డాక్టర్ కొప్పోలురెడ్డి శేఖర్ రెడ్డి సభా సమన్వయం చేశారు. ఈ సందర్భంగా నటులు పద్యాలను, నటనలోని కొన్ని సన్నివేశాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో లలిత కళల శాఖ అధ్యాపకులు సిహెచ్ వెంకటేష్, బి.చినరాయుడు, బి.వీరప్ప, ఎం.వాసవి, చంటి సూరి, సిద్ది రాజ్, టెక్నికల్ అసిస్టెంట్ వి. సుధాకర్, ఆఫీస్ సిబ్బంది లక్ష్మయ్య , విద్యార్థులు పాల్గొన్నారు.
