ప్రజాశక్తి – వేంపల్లె భవిష్యత్తులో గమ్యస్థానానికి చేరుకోవాలంటే ప్రతి విద్యార్థిలో లక్ష్యం అనేది ఉండాలని చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి అన్నారు. ఆర్‌జెయుకెటి పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం మండలంలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌ను పూర్వ విద్యార్థినైనా చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి సందర్శించారు. విద్యార్థులతో యుపిఎస్ సి సెషన్ కోసం ఇంటరాక్టివ్ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి స్థాపించిన ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలోనే 2008 బ్యాచ్‌లో ఇసిఇ విద్యను అభ్యసించినట్లు చెప్పారు. 2021 యుపిఎస్‌లో 221 ర్యాంకు సాధించడం వల్ల ఉన్నత స్థాయికి ఎదిగినట్లు చెప్పారు. విద్యార్థుల్లో అకుంఠిత దీక్ష అనేది తప్పకుండా ఉండాలని సూచించారు. జిల్లా స్థాయి అధికారి హోదాలో తాను విద్యను అభ్యసించిన ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌ను సందర్శించడం చాలా సంతోషంగా ఉందన్నారు. చెడు అలవాట్లుపై దష్టి పెట్టకుండా విద్య వైపునే విద్యార్థులు దష్టి సారించాలని కోరారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ అనేది ముఖ్యం అన్నారు. ప్రతి విద్యార్థుల్లో ఒక్కొక్క లక్ష్యం అనేది పెట్టుకొని ముందుకు సాగాలని కోరారు. ట్రిపుల్ ఐటీ క్యాంపస్ కు జాయింట్ కలెక్టర్ హోదాలో పూర్వ విద్యార్థి విద్యాధరి విచ్చేయడంతో డైరెక్టర్ కుమార స్వామి గుప్తా, పరిపాలన అధికారి డాక్టర్ రవికుమార్, ఢన్‌ీ రత్నకుమారితో పాటు అధ్యాపకులు ఘన స్వాగతం పలికారు.
