ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: రాష్ట్ర స్థాయి రెడ్‌రన్ మారథాన్ 5 కెఎమ్ పోటీల్లో చీరాల వైఎ మహిళా కళాశాలకు చెందిన వి.చెన్నని ద్వితీయ స్థానం, రమ్య జోరు తృతీయ స్థానంలో నిలిచారు. రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో మారథాన్ పోటీలను గతవారం విజయ వాడలో నిర్వహించారు. ఈ పోటీలలో జిల్లా నుంచి డిఎస్‌ఎమ్ సుబ్బరాజు, ఎ.కోటేశ్వ రరావు, ఎన్.రమ్యాజారు, వి.చెన్ననీల పాల్గొన్నారు. వీరిక బాపట్ల డిఆర్ ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ టెక్నాలజీకి చెందిన ఫిజికల్ డైరెక్టర్ ఫణేంద్ర మార్గదర్శకులుగా వ్యవహరించారు. ప్రతిభ చూపిన విద్యార్థులు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని ఏపీ శాక్స్ అధికారులు ప్రకటించారు. ఈ సందర్భంగా సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి, జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఎస్ విజయమ్మ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ జానిభాష, చీరాల వైఎ మహిళా కళాశాల ఫిజికల్ డైరెక్టర్ నీలకుమారి, ఎంఎస్ ఆర్ అకాడమీ కోచ్ వేణు విద్యార్థులను అభినందించారు.