క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలి

ప్రజాశక్తి – కడప విద్య చాలా విలువైందని క్రమశిక్షణతో అభ్యసించి ఉన్నత శిఖరాలు చేరుకోవాలని సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎస్‌. బాబా ఫక్రుద్దీన్‌ అన్నారు. పిల్లల ఆరోగ్య విషయాల పట్ల ఎప్పటికప్పుడూ తగు జాగ్రత్తలు వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం ప్రభుత్వ బాలుర వసతి గహం, ప్రభుత్వ పరిశీలన గహం, హాస్టల్‌లను జడ్జి సందర్శించారు. పిల్లలు ఏయే తరగతులను అభ్యసిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. తరగతి గదులను, వంటశాలను పరిశీలించారు. పిల్లలకు అందుతున్న భోజన సద ుపాయాలపై ఆరా తీశారు. పిల్లల విద్యా, ఆరోగ్య విషయాల పట్ల తగు జాగ్ర త్తలు వహించాలన్నారు. అనంతరం హాస్టల్‌ను విజిట్‌ చేసి వారికి అందుకున్న భోజనం సదుపాయాలను పరిశీలించారు. ఏవైనా సమస్యలుంటే జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ, కడప వారి దష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ బాలుర వసతి గహం, ప్రభుత్వ పరిశీలన గహం, సూపరింటెండెంట్‌ వీరయ్య, డిస్ట్రిక్‌ ప్రొబిషన్‌ ఆఫీసర్‌ చెన్నారెడ్డి, వైద్యాధికారి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️