ప్రజాశక్తి-మద్దిపాడు: కాంగ్రెస్ పార్టీ జిల్లా ఓబీసీ చైర్మన్‌గా మద్దిపాడుకు చెందిన సీనియర్ నాయకులు నట్టే సుబ్బారావును పార్టీ అధిష్టానం నియమించింది. ఈ మేరకు మంగళవారం విజయవాడలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా నట్టే సుబ్బారావు మాట్లాడుతూ పార్టీని నమ్ముకొని కష్టపడి పని చేసే వారికి ఎల్లప్పుడు గుర్తింపు ఉంటుందని అన్నారు. తన నియామకానికి సహకరించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల, జిల్లా అధ్యక్షులు ఎస్కే సైదా, నియోజకవర్గ ఇన్చార్జి పాలపర్తి విజేష్‌కు ఆయన కతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ఓబిసి చైర్మన్ శొంఠి నాగరాజు ఆధ్వర్యంలో నేషనల్ ఓబీసీ చైర్మన్ కెప్టెన్ అజరు సింగ్ సమక్షంలో జిల్లా ఓబీసీ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేశానని తెలిపారు. ఈ సందర్భంగా నట్టే సుబ్బారావుకు మండల అధ్యక్షులు కొలిజేటి గురుబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.
