ప్రజాశక్తి-తిరుపతి : వైసిపి యువత పోరును విజయవంతం చేయాలని భూమన కరుణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం తిరుపతి పద్మావతీ పురంలోని స్వగృహంలో ”వైసిపి యువత పోరు” పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందన్నారు. ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిందని.. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ఆయా కాలేజీలకు చెల్లించకుండా చేతులు ఎత్తేయడంతో పేద విద్యార్థులు ఫీజులు కట్టలేక.. పరీక్షలు రాయలేక.. ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేవారు. .. ఇవన్నీ కూటమి పార్టీలకు కనిపించవని.. అందుకే ఈ గుడ్డి ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేలా వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఈనెల 12న జరిగే యువత పోరును విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష, తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తలు భూమన అభినరు రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, బియ్యపు మధుసూదన్ రెడ్డి, వైసిపి జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి పలువురు కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
