డిగ్రీ సెమిస్టర్‌ ఫలితాల్లో ‘టిఆర్‌ఆర్‌’ విద్యార్థుల విజయకేతనం

Jun 20,2024 19:46
'టిఆర్‌ఆర్‌' విద్యార్థుల విజయకేతనం

ఉత్తమ ఫలితాలు సాదించిన టిఅర్‌అర్‌ విద్యార్థులు
డిగ్రీ సెమిస్టర్‌ ఫలితాల్లో ‘టిఆర్‌ఆర్‌’ విద్యార్థుల విజయకేతనం
ప్రజాశక్తి-కందుకూరు :ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం డిగ్రీ డో సెమిస్టర్‌ బిఎ, బీకాం కంప్యూటర్‌ పరీక్షా ఫలితాల్లో టి ఆర్‌ ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు అత్యున్నత ఫలితాలు సాధించారని ఆ కళాశాల నిర్వాహకులు వెల్లడించారు. .కామర్స్‌ విభాగంలో మూడు పేపర్లలో 100శాతం ఫలితాలు మూడు పేపర్లలో 97శాతం ఫలితాలు సాధించారన్నారు. మేనేజ్మెంట్‌ అకౌంటెన్సీ పేపర్లో జే .సుస్మిత , ఎన్‌ .బాల నరసమ్మ 92/100 సాధించారని తెలిపాఉ. . సర్వీస్‌ మార్కెటింగ్‌ పేపర్లో కె త్రివేణి 95/100 తెచ్చుకున్నాన్నారు. బి.కామ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌లో ఈ- కామర్స్‌, ఆర్టిజిఎస్‌ పేపర్లలో 97శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. కంప్యూటర్‌ అప్లికేషన్‌ పేపర్లో కే. త్రివేణి 91/100 మార్కులు సాధించడం జరిగింది.స్పెషల్‌ ఇంగ్లీషు లో ఆరో పేపర్లో 100% ఏడో పేపర్లో 95 శాతం ఉతీర్ణులయ్యారు. జి .మౌనిక 90/100 మార్కులు సాధించారని తెలిపారు. చరిత్రలో ఆరో పేపర్‌ 100శాతం ఏడో పేపర్‌ 90 శాతంఉత్తీర్లయ్యారన్నారు. . ఎస్‌ .కరీముల్లా, డి. ధనుంజరు 92/100 మార్కులు సాధించారన్నాఉ. పొలిటికల్‌ సైన్స్‌ లో 6 ,7 పేపర్లలో 90 శాతం ఉత్తీర్ణత సాధించాన్నాఉ. ఆలూరి ప్రవల్లిక , జి. మౌనిక 90/100 మార్కులు సాధించారన్నాఉ. .స్పెషల్‌ తెలుగులో ఆరో పేపర్‌, ఏడో పేపర్‌లో 100శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. అర్థశాస్త్రంలో రెండు పేపర్లలోనూ 100శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. బి. నరేంద్ర 90/100 మార్కులు సాధించాన్నాఉ. టిఆర్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పేద, మధ్య తరగతి విద్యార్థులకు మెరుగైన విద్యనందిస్తూ వారికి బంగారు భవిష్యత్తును అందిస్తుందన్నారు. రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ న్యాక్‌ ఎ+ గ్రేడు సాధించి, త్వరలో స్వయం ప్రతిపత్తి (అటానమస్‌) హోదా వైపు అడుగిడబోతున్నదని కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎం రవికుమార్‌ తెలిపారు. మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్‌ అధ్యాపక బందం అభినందించాఉ. 2024-25 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమైనట్లు తెలిపారు.

➡️