గుడ్లవల్లేరు ఫార్మసీ కళాశాల విద్యార్థుల విజయం

ప్రజాశక్తి-గుడ్లవల్లేరు (కృష్ణా) : స్థానిక వివి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ సైన్సెస్‌ కళాశాల విద్యార్థులు ఈ నెల 17న కెవిఎస్‌ఆర్‌ సిద్ధార్థ కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ సైన్సెస్‌ విజయవాడలో నిర్వహించిన జాతీయ సదస్సులో పాల్గొని విజయం సాధించినట్లు కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎ లక్ష్మరావు సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … విద్యార్థులు సదస్సులో పాల్గని ఈ-పోస్టర్‌ ప్రదర్శించారని తెలిపారు. బి ఫార్మసీ మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు జే.కాంక్ష మొదటి బహుమతిని, కే.తరుణ్‌ కుమార్‌ రెండవ స్థానాన్ని, ఎండి. కౌసర్‌ రబియా మూడో స్థానాన్ని గెలుచుకున్నారు. విజయం సాధించిన విద్యార్థులకు ప్రశంసాపత్రంతోపాటు మెమెంటో బహుకరించి ప్రోత్సహించారని తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఏ.లక్ష్మణరావుతో పాటు అధ్యాపకులు డాక్టర్‌ ఎస్‌ కె.అమీనాబీ, డాక్టర్‌ పి.రవిష, డాక్టర్‌ టి.ప్రశాంతి, డాక్టర్‌ టి.బాలకఅష్ణ, బి.సత్యశ్రీ, టి.శ్రావణి, విఎల్‌.వినోద్‌ కుమార్‌, డాక్టర్‌ వి.రజని, తదితరులు విద్యార్థులకు అభినందన తెలిపారు.

➡️