కాంగ్రెస్‌ ఎస్‌ సి సెల్‌ అధ్యక్షుడిగా సుదర్శనం

ప్రజాశక్తి – పెద్దాపురం (కాకినాడ) : పెద్దాపురం రూరల్‌ మండలం కాంగ్రెస్‌ పార్టీ ఎస్‌ సి సెల్‌ అధ్యక్షులుగా వాలు తిమ్మాపురం గ్రామానికి చెందిన ప్రముఖ న్యాయవాది చిలకపాటి సుదర్శనం నియమితులయ్యారు. మంగళవారం కాకినాడ లోని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మాజీ కేంద్రమంత్రి ఎం ఎం పల్లంరాజు చేతుల మీదుగా ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు మాదేపల్లి సత్యనారాయణ, పెద్దాపురం నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇంచార్జి తుమ్మల దొరబాబు, పెద్దాపురం కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు తోట కరుణాకర్‌ (సోనీ) తదితరులు పాల్గొన్నారు.

➡️