రైతులకు ఊపిరిపోసిన వర్షం

Aug 30,2024 16:59 #farmers, #Rain, #Suffocating

ప్రజాశక్తి-చిలకలూరిపేట (గుంటూరు) : దుక్కి దున్ని వ్యవసాయం చేసి పొగాకు, మిర్చి పంటల సాగు కోసం సిద్ధంగా పెట్టిన రైతులు, కౌలు రైతులకు ఈ వర్షం పూర్తిగా ఊపిరిపోసింది. సుమారుగా 70, 80 రోజుల నుంచి మండల పరిధిలో పొలాల సాగుకు సరైన వర్షం పడలేదని రైతులు అంటున్నారు. పట్టణ, మండల స్థాయిలో అల్పపీడనంతో గురువారం రాత్రి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తుండటంతో రైతులు, కౌలు రైతులు ఊపిరిపీల్చుకున్నారు. మండలంలో పత్తి పంట సుమారుగా రెండు వేల ఎకరాల్లో సాగు చేశారు. ఇతర పంటలు, 20 సెంట్లు, 1/2 అర ఎకరాలు, ఎకరా ఇట్లా కొద్దీ భూములలో రకరకాల కూరకాయలు వేశారు. మురికిపూడి, తాతపూడి, మంగలపాలెం, మున్సోరివారిపాలెం, తదితర గ్రామాలలో వేసిన పొగాకు నారు మళ్లకు ఈ వర్షం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇహ నుంచి వందల ఎకరాల్లో వేయబోయే పొగాకు నారుమళ్లకు కూడా మంచి ఉపయోగకరంగా ఉంటుంది. ఈ వర్షంతో వ్యవసాయం మండలంలో ఊపందుకుంటుంది. దుక్కి దున్ని సిద్ధంగా ఉంచిన పొలాల్లో పొగాకు, మిర్చి పంటలు, కొద్దిపాటి కూరకాయలు, ఇతర పంటలు వేస్తారు. ప్రతి పంటకు జీవం పోసినట్లు అవుతోంది. మండలం మొత్తంలో పంట వేసి ప్రస్తుతానికి 50, 70 రోజులు కావస్తోంది. అయినా మొదట్లో సరైన వర్షం లేదు. విత్తనాలు నాటుకునేందుకు, మొక్కలు బతికేందుకు మాత్రమే ఉపయోగకరంగా ఉండింది. ఈ పంట వల్ల జీవం పోసినట్లు అయిది. పంట వేసిన తరువాత ఈ 70 రోజుల లో సరైన వర్షాలు లేవు. దీంతో పంట బెట్టకు వచ్చి ఎత్తు పెరగక, పూత పిందెలు సక్రమంగా రావు. ఈ దశలో పచ్చదోమ, రసం పీల్చుపురుగులు ఆశించాయి. దీంతో నిన్న మొన్నటి దాకా వర్షాలు లేక పత్తి పంట కుదేలయ్యింది. తడి పెడదామనుకుంటున్న సరి అయిన సమయానికి ఈ వర్షం పడి పత్తి రైతులకు ఊపిరి పీల్చుకునేలా చేసింది. ఇలాంటి సమయంలో ఈ వర్షం మిగిలిన కూరకాయలు, పొగాకు, నారుమళ్లు, రైతులకు, ఇతర రైతులకు అనుకూల ఉంది. ఇహ నుంచి వ్యవసాయం పూర్తిగా జోరందుకుంటుంది.

➡️