టిడిపికి పూర్వ వైభవం తీసుకొస్తాం – మండిపల్లి, సుగవాసి

ప్రజాశక్తి-రాయచోటి నియోజకవర్గంలో టిడిపికి పూర్వవైభవం తీసుకువచ్చి చరిత్రను తిరగరాస్తామని టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, టిడిపి రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి సుగవాసి ప్రసాద్‌బాబు పేర్కొన్నారు. బుధవారం ఇరువురు కలిసి పట్టణంలోని 1, 2, 3, 4వ వార్డులలో ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ప్రసాద్‌బాబు మాట్లాడుతూ వైసిపి పాలనపై ప్రజలు విసిగి పోయారని, అరాచక పాలనకు చరమగీతం పాడే రోజు దగ్గరలోనే ఉందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో రాయచోటి ఎమ్మెలే అభ్యర్థిగా మండిపల్లి రాంప్ర సాద్‌రెడ్డిని, కూటమి రాజంపేట ఎంపీ అభ్యర్థి కిరణ్‌కుమార్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. ఎల్లప్పుడూ ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలతో కలిసి వారి సమస్యలకు పరిష్కరిస్తామని హామీనిచ్చారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️