గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య

ప్రజాశక్తి-తర్లుపాడు: గుర్తు తెలియని వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తర్లుపాడు, మార్కాపురం రైల్వే స్టేషన్ల మధ్య శనివారం జరిగింది. తర్లుపాడు రైల్వే స్టేషన్‌ మాస్టర్‌ తెలిపిన వివరాల మేరకు.. తర్లుపాడు, మార్కాపురం రైల్వే స్టేషన్ల మధ్య సుమారు 45 సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తి మృతదేహం గుర్తించి ఫిర్యాదు చేయగా ఆర్పీఎఫ్‌ హెడ్‌ కాని స్టేబుల్‌ టి.ఖలీల్‌ అహమద్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు తెల్లని చొక్కాపై నలుపు రంగు నిలువు, అడ్డం గీతలు కలిగిన ఫుల్‌ షర్ట్‌, ప్యాంటు ధరించి ఉన్నాడు. ఎత్తు సుమారు ఐదున్నర అడుగులు, చామన చాయ రంగు కలిగి ఉన్నట్లు ఆర్పీఎఫ్‌ పోలీసులు తెలిపారు. మతుడికి సం బంధించిన వివరాలు తెలిసిన వారు నంద్యాల సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.అబ్దుల్‌ జలీల్‌ 9440627653 కు కానీ, కర్నూల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీసు యమ్‌.శ్రీనాథ్‌ రెడ్డి 9908889696 నెంబర్లకు కాల్‌ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు.

➡️