చాగల్లు శాఖా గ్రంధాలయంలో వేసవి విజ్ఞానం

May 21,2024 12:32 #Library, #Summer Science Camp

ప్రజాశక్తి-చాగల్లు (తూర్పు గోదావరి) : చాగల్లు శాఖా గ్రంధాలయంలో వేసవి విజ్ఞాన శిబిరాలలో మంగళవారం విద్యార్థులకు నీతి కథలు, వేమన పద్యాలు వర్ణించడమైనది. విద్యార్థులతో పుస్తక పఠనం చేయించి వారు చదివిన పుస్తకాల్లో అంశాలపై గ్రంథాలయ అధికారి గద్దె శ్రీనివాస్‌ సమీక్ష చేసినారు. విద్యార్థులకు డ్రాయింగ్‌ పోటీ నిర్వహించారు. విద్యార్థులకు ఆటవిడుపుగా చదరంగం, క్యారంస్‌ ఆడించబడినది అని అధికారి తెలిపారు.ఈ వేసవి విజ్ఞాన శిబిరంలో 23మంది విద్యార్థులు పాల్గొన్నారని అన్నారు.

➡️