రాజోలులో ఘనంగా సుందరయ్య వర్థంతి

May 19,2024 11:02 #Rajolu, #Sundaraiah, #vardanti

ప్రజాశక్తి- రాజోలు (కోనసీమ) : భారత కమ్యునిస్టు ఉద్యమ నిర్మాత, కార్మిక, కర్షక, పేద ప్రజల ఆశజ్యోతి, మహౌన్నత వ్యక్తి, నిజాయతీ, నిబద్ధత, క్రమశిక్షణ, కు నిలువుటద్దం, భారతదేశ రాజకీయాలలో మచ్చలేని మహా నాయకుడిగా పేరు పొందిన నాయకుడు కామ్రేడ్‌ పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి కార్యక్రమం స్థానిక రాజోలు అంబేద్కర్‌ భవనంలో సిపిఎం శాఖ ఆద్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటి సభ్యులు పీతల రామచంద్రరావు మాట్లాడుతూ, నేడు పుచ్చలపల్లి సుందరయ్య జీవితం ప్రతి ఒక్క రాజకీయ నాయకులకు ఆదర్శం కావాలి, నేటి యువతరానికి ఆయన ఒక స్ఫూర్తిదాయకం, రాజకీయం అంటే ప్రజాసేవ అని నిరూపించిన వ్యక్తి, నిజంగా సుందరయ్య గారి కి నివాళులు అర్పించడం అంటే ఆయన కోరుకున్న సమసమాజం, కార్మిక వర్గం హక్కుల సాధనకై ఉద్యమాలు ఉదఅతం చేయాలనీ, కార్మిక వర్గం బానిస సంకెళ్లు విముక్తి చెందినప్పుడేనాని ,సమాన పనికి సమాన వేతనం సాధించగలిగినప్పుడు, రైతాంగానికి గిట్టుబాటు ధర సాధించుకోగలిగినప్పుడు, వ్యవసాయ కార్మికులకు కనీస కూలి గిట్టుబాటు దొరికినప్పుడు, పేద ప్రజలందరికి ఉపాధి ,ఉద్యోగ అవకాశాలు, సాధించగలిగినప్పుడే నిజమైన నివాళి అని ఆయన అన్నారు, ఈ కార్యక్రమంలో నాయుకులు తాడి శ్రీరాముర్తి, కారుపల్లి గోపాల్‌, బళ్ల పర్వతాలు, పి.రాజశేఖర్‌, పలువురు పాల్గొన్నారు.

➡️