సహాయనిధి చెక్కులు అందజేత

ప్రజాశక్తి- కొల్లూరు : మండల పరిధిలోని రావికంపాడు గ్రామానికి చెందిన కష్ణమోహన్‌ ,సుభాష్‌ చంద్రబోస్‌, పెసర్లంక గ్రామానికి చెందిన శ్రీనివాసరావు, చిన్న పులివర్రు గ్రామానికి చెందిన ఆషా, కొల్లూరు గ్రామానికి చెందిన నాగలక్ష్మి, కోటిపల్లి గ్రామానికి చెందిన వెంకటలక్ష్మికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.3,10,300 మంజూరయ్యాయి. బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు చేతుల మీదుగా గురువారం చెక్కులు అందజేశారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️