సిపిఎం పార్టీ అభ్యర్థిని ఆదరించండి : మూలం రమేష్‌ పిలుపు

ప్రజాశక్తి-నెల్లూరు : ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా చేసుకున్న సిపిఎం పార్టీని ఆదరించాలని, రాజకీయాన్ని వ్యాపారంగా చేసి సంపాదనకు ఒక సాధనంగా మార్చుకుంటున్న వైసిపి, టిడిపి, జనసేన పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలని నగర నియోజకవర్గం అసెంబ్లీ స్థానానికి సిఎం అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచిన మూలం రమేష్‌ పిలుపునిచ్చారు. శనివారం సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో 5వ డివిజన్‌ పరిధిలోని సత్యనారాయణపురం ప్రాంతంలో ఇంటింట ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ … ప్రధానంగా బోడిగాడితోట ప్రాంతంలో కార్పోరేషన్‌కు సంబంధించిన డంపింగ్‌ యార్డు నుంచి దుర్గంధభరితమైన వాసనలు వెదజల్లుతుండటం, ఆ కారణంగా ఈ ప్రాంత వాసులు తీవ్ర అనారోగ్యానికి గురి అవుతున్న సమయంలో సిపిఎం ఆందోళన కార్యక్రమాలు చేపట్టి డంపింగ్‌ యార్డును ఆ ప్రాంతం నుంచి తర లించేందుకు కఅషి చేసిందన్నారు. మరో ప్రక్క ప్రతి ఏడాది వరదలు సంభవించిన సమయంలో ప్రాంతం ముంపుకు గురవుతుందని, అంతే కాకుండా వరద నీటి ఉదఅతికి భూభాగం కుంగిపోయి ఈ ప్రాంత వాసుల ఇళ్ళు పడిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయన్నారు. ఈ నేపధ్యంలో వరదలు సంభవించిన సమయంలో కలిగే నష్టాన్ని అధిగమించేందుకు పెన్నా నది ప్రాంతంలో రివెట్మెంట్‌ (రక్షణ గోడ) నిర్మించి ప్రజల ఆస్థులను కాపాడేందుకు ఈ ప్రభుత్వం కనీస భాద్యతగా తీసుకొని నిర్మాణ పనులు త్వరితగతిన ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టణ సంస్కరణల పేరు తో ఇంటి పన్ను పెంపు, వాటర్‌ ఛార్జీలు పెంపుదల, చివరకు చెత్త పన్ను విధించడం ప్రజలపై ఆర్థిక భారాలు మోపడం సరికాదన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం విభజన హామీలను అనుసరించి ప్రత్యేక హెరీదా ప్రకటించకుండా ద్రోహం చేసిందన్నారు. ఎన్నికల సమయంలో నల్లదనాన్ని వెలికి తీసి ప్రతి నిరుపేద బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని హామీలు చేసి విస్మరించిందన్నారు. డీజిల్‌, ఎట్రోల్‌ ధరలు పెంచి సామాన్య మధ్యతరగతి ప్రజలపై ఆర్థిక భారాలు మోపిందన్నారు. పెంచిన ధరలు తగ్గించేందుకు, నిరుద్యోగ సమస పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. తాము అధికారంలోకి వస్తే ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగ నియామకాలు చేపట్టి నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి విస్మరించిందన్నారు.అంతే కాకుండా ప్రభుత్వ రంగ సం స్థలను ప్రైయివేటీకరణ చేసి లక్షలాధి మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కాలరాసిందన్నారు. విద్యుత్తు బిల్లులు పెరిగిన సమయంలో తగ్గించాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేశామన్నారు. టిడిపి, వైసిపి అభ్యర్థులు ఇబ్బిడి ముబ్బిడిగా నగదు, మద్యం పంపిణీ చేసి ఓట్లు కొనుగోలు చేసి రాజకీయాన్ని వ్యాపారంగా మార్చి సంపాదనకు ఒక సాధనం గా మార్చుకుంటున్నారన్నారు. గడిచిన 10 ఏళ్ల నుంచి ప్రజలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని, రాష్ట్రంలో జరుగుతు న్నది ఇదే అన్నారు. రాష్ట్రం, జిల్లా ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యనికి గురైందని, పరిశ్రమలు లేవని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేవని, ధరలు ఆకాశానంటుతున్నాయన్నారు. ప్రజలకు బతుకుతెరువు ఒక సమస్యగా మారిపోయిన ఈ రోజుల్లో దీనికి వ్యతిరేకంగా పోరాటం చేసే సిపి ఎం అభ్యర్థి గెలుపుకు ప్రతి ఒక్కరు సహకరించాలని పిలుపు నిచ్చారు. జిల్లాలో జెన్కో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం ప్రయివేటీకరణ చేయకుండా అడ్డుకున్నామంటే ఒక్క సిపిఎం, ట్రేడ్‌ యూనియన్లు చేసిన పోరాట ఫలితమే అని గుర్తు చే శారు.కార్మికులు, కర్షకుల, నిరుపేదల సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం పోరాటాలు, ఉద్యమాలు చేస్తు అండగా నిలుస్తున్న పార్టీ సిపిఎం అన్నారు. ప్రజల పక్షాన నిలుస్తున్న పార్టీని ఆదరించాలని, సిపిఎం పార్టీ ఎన్నికల గుర్తు సుత్తికొడ వలి నక్ష్యత్రం పై ఓట్లు వేసి గెలిపించాలన్నారు. ప్రజా సమస్యలపై చట్ట సభల్లో గళం విప్పి మాట్లాడేందుకు ఒక ప్రతినిధి అవ సరమని, ఇది గుర్తించి రానున్న ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థికి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. సిపిఎం నాయకులు టి.వి. వి. ప్రసాద్‌ మాట్లాడుతూ రాష్ట్రానికి తీవ్రంగా అన్యాయం చేసిన బిజెపితో ప్రత్యక్షంగా, పరోక్షంగా వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు జతకట్టాయన్నారు. దేశంలో, రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో జిల్లాకు ఒక ప్రత్యేకత చోటు చేసుకుందన్నారు.ఒక ప్రక్క కార్మిక, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు చేసిన మూలం రమేష్‌ ఒక ప్రక్క, నగదు, మ ద్యం పంపిణీ చేస్తూ ఏ విధంగా అయినా అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఆరాటపడుతున్న వైసిపి, టిడిపి పార్టీలు మరో ప్రక్క పోటీ పడుతున్నాయన్నారు.నగరంలో నిరుపేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ, దోమ నివారణ, మంచినీటి సరఫరా, ఇంటి పన్ను సమస్యలు ఇలా పలు సమస్యలపై ప్రజల పక్షాన నిలిచి పోరాటం చేసింది సిపిఎం పార్టీ ఒక్కటే అన్నారు. అటువంటి చరిత్ర కలిగింది సిపిఎం మాత్రమే అన్నారు. నగరంలో అభివఅద్ధి చెందాలన్నా, ప్రజల సమస్యలు పరిష్కారం కావాలన్నా, ప్రజల సమస్యలను చట్టసభల్లో ప్రస్తావించాలన్నా సిపిఎం పార్టీకి చెందిన అభ్యర్థి అసెంబ్లీకి వెళ్తేనే సాధ్యమౌతుందన్నారు. అటు వంటి వ్యక్తిని గెలిపించాలని ఓటర్లుకు పిలుపు నిచ్చారు. ఈ ప్రాంతంలో సిసి రోడ్లు నిర్మాణం, డ్రైనేజీ నిర్మాణం, మంచినీటి సరఫరా సమస్యలకు పరిష్కారం ఒక్క సిపిఎం కార్పోరేటర్‌ చేసిన పోరాటంతోనే లభించిందన్నారు. ఈ ప్రచార కార్యక్ర మంలో సిపిఎం నాయకులు జి. నాగేశ్వరరావు, కత్తి శ్రీనివాసులు, జి. నాగేశ్వరరావు, మహిళా నాయకురాలు షేక్‌ మస్తా నభీ, కత్తి పద్మా, చిరంజీవి పలువురు శాఖ సభ్యులు పాల్గొన్నారు.

➡️