పాత పెన్షన్ విధానం అమలు చేసే పార్టీకే మద్దతు : యుటిఎఫ్

Feb 27,2024 17:53 #Annamayya district, #Dharna, #utf

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ (అన్నమయ్య) : రాబోయే ఎన్నికల్లో ఉపాధ్యాయ, ఉద్యోగలకు పాత పెన్షన్ విధానం అమలు చేసే వారికే మద్దతు లభిస్తుందని యుటిఎఫ్ నాయకులు పేర్కొన్నారు. మంగళవారం రాజంపేట పట్టణంలో యుటిఎఫ్ ఆధ్వర్యంలో ముద్రించిన “ఓట్ ఫర్ ఓ.పి.ఎస్ ” పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ బుక్ లెట్ సి.పి.యస్, జీ.పీ.ఎస్ వల్ల కలిగే నష్టాలను బేరీజు వేసి ఉద్యోగ వర్గాలను, ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు దోహదం చేస్తుందని యు టీ ఎఫ్ నాయకులు తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక, పెన్షనర్ల సమస్యలు ప్రధాన అజెండాగా మారనున్నట్గు తెలిపారు. అందువల్ల ప్రధాన పార్టీలు వారి ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకోక తప్పదని, ఉద్యోగుల పట్ల చులకనగా వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఉద్ఘాటించారు. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలు ఒపిఎస్ దిశగా అడుగులు వేస్తూ వుంటే ఈ రాష్ట్రంలో మాత్రం ఇచ్చిన హామీ అమలు కాక ఉద్యోగులలో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు హరి ప్రసాద్, రాష్ట్ర కౌన్సిలర్ చెంగల్ రాజు, జిల్లా కార్యదర్శులు వెంకట సుబ్బయ్య, రమణ మూర్తి, జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు రమణయ్య, నాయకులు నాగేంద్ర, వినోద్ కుమార్, నరసింహారావు, సాంబ శివ రావు, మాధవ మూర్తి, శివయ్య, రామచంద్ర, రవి చంద్ర ప్రసాద్, సి.వెంకట సుబ్బయ్య, వేణుగోపాల్, క్రిష్ణయ్య, శ్రీనివాసులు, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.

➡️