రామకృష్ణకు లేఖ ఇస్తున్న కెఎస్ లక్ష్మణరావు
ప్రజాశక్తి-గుంటూరు : శాసన మండలికి ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభుద్రలు నియోజకవర్గానికి మార్చిలో జరిగే ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్, నిరుద్యోగులు కోసం కృషి చేసిన పిడిఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు తనకు మద్దతు తెలియజేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, రాష్ట్ర నాయకులు అక్కినేని వనజనను కలిసి అభ్యర్థించారు. గత 14 ఏళ్లుగా ఎమ్మెల్సీగా రాజ్యాంగ విలువలకు కట్టుబడి నిజాయితీగా పనిచేస్తున్నానని, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, నిరుద్యోగులు, కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు, కౌలురైతులు, అంగన్‌వాడీలు, మహిళలు, సామాజిక వర్గాల సమస్యలు మొదలైన వాటిపై శాసన మండలి లోపలా, వెలుపలా పనిచేస్తున్నానని, జరుగుతున్న ఉద్యమాలకు అండగా ఉంటున్నానని చెప్పారు.