శ్రీవారిని దర్శించుకున్న సిజెఐ జస్టిస్‌ చంద్రచూడ్‌

ప్రజాశక్తి- తిరుపతి సిటి : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ ఆదివారం దర్శించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన ఆయనకు టిటిడి ఇఒ శ్యామలరావు, అదనపు ఇఒ సిహెచ్‌ వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సివిఎస్వో శ్రీధర్‌, డిప్యూటీ ఇఒలు లోకనాథం, భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

సాదర వీడ్కోలు
జస్టిస్‌ చంద్రచూడ్‌ తిరుపతి జిల్లాలో రెండ్రోజుల పర్యటన ముగించుకుని ఆదివారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం నుండి తిరుగు ప్రయాణమయ్యారు. ఆయనకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు జడ్జి అండ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ జడ్జ్‌ ఆఫ్‌ చిత్తూరు జిల్లా జస్టిస్‌ పి కష్ణమోహన్‌, రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఎపి హైకోర్టు జస్టిస్‌ వై.లక్ష్మణరావు, రిజిస్ట్రార్‌ ప్రోటోకాల్‌ హైకోర్టు ఆఫ్‌ ఎపి జస్టిస్‌ రాఘవ స్వామి, రిజిస్ట్రార్‌ మేనేజ్మెంట్‌ హైకోర్టు ఆఫ్‌ ఎపి జస్టిస్‌ రామకష్ణ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ శుభం బన్సల్‌ తదితరులు సాదర వీడ్కోలు తెలిపారు.

➡️