ప్రజాశక్తి వార్తకు స్పందన – ఆక్రమణలపై సర్వే

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : శుక్రవారం ప్రజాశక్తి దినపత్రికలో ప్రచురించబడిన ప్రభుత్వ భూమి కబ్జా అనే వార్తకు నగర పాలక సంస్థ అధికారులు స్పందించారు. కమిషనర్‌ నల్లనయ్య ఆదేశాల మేరకు టౌన్‌ ప్లానింగ్‌ ఎ సి పి ఐవి రమణమూర్తి ఆధ్వర్యంలో టిపిఓ అప్పలరాజు, టౌన్‌ సర్వేయర్‌ సింహాచలం కె ఎల్‌ పురం సర్వే నెంబర్‌ 165 లో ఉన్న భూమిని పరిశీలించారు. ప్రభుత్వ భూమి ఎంత ఉందో సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా ఎ సిపి రమణమూర్తి మాట్లాడుతూ … సర్వే చేసిన తర్వాత కమిషనర్‌ ఆదేశాల ప్రకారం ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడం జరుగుతుందన్నారు. సర్వే పూర్తి అయిన తర్వాత ప్రభుత్వ భూమిలో బోర్డులు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. విచారణలో మండల రెవెన్యూ అధికారి, సచివాలయ సిబ్బంది, వార్డు కార్పొరేటర్‌ తాళ్లపూడి సంతోషి కూడా పాల్గొన్నారు.

➡️