భవనం శ్రీనివాసరెడ్డిపై సస్పెన్షన్‌ ఎత్తివేత

Apr 15,2024 14:17 #cancle, #Suspension, #YCP Leaders

ప్రజాశక్తి-ఇంకొల్లు రూరల్‌ (బాపట్ల) : పర్చూరు నియోజకవర్గం ఇంకొల్లు మండలానికి చెందిన భవనం శ్రీనివాసరెడ్డిపై వైసిపి అధిష్టానం సస్పెన్షన్‌ ను ఎత్తివేసినట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం నుండి ఆదేశాలు అందాయి. భవనం శ్రీనివాసరెడ్డికి సంతనూతలపాడు నియోజకవర్గ పరిశీలకులుగా బాధ్యతలు అప్పగించారు. తరువాత భవనం శ్రీనివాసరెడ్డిని పార్టీ నుండి సస్పెన్సన్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం తిరిగి మళ్లీ ఆ సస్పెన్షన్‌ను ఎత్తివేస్తున్నట్లు తిరిగి పార్టీలోకి తీసుకుంటున్నట్లు ఆపార్టీ అధ్యక్షులు వై.ఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఉత్తర్వులు అందాయి.

➡️