ఇద్దరు సచివాలయ సిబ్బంది సస్పెన్షన్‌

ప్రజాశక్తి- కడప అర్బన్‌ పన్నులు తగ్గిస్తామని చెప్పిన ఇషయంలో ఇద్దరు సచివాలయ సిబ్బందిని మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ మనోజ్‌రెడ్డి సస్పెండ్‌ చేశారు. వారితోపాటు ఇన్‌ఛార్జి ఆర్‌ఐ కూడా సస్పెండ్‌కు గురయ్యారు. శుక్రవారం కమిషనర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కమిషనర్‌ మాట్లాడారు. కార్పొరేషన్‌, సచివాలయ సిబ్బంది ఇళ్ల వద్దకు వచ్చి ఇంటి పన్నులు వాస్తవిక పరిస్థితులకు తగ్గట్టు కాకుండా పన్నులు తగ్గిస్తామని అని చెబితే ప్రజలు ఎవరు నమ్మవద్దని చెప్పారు. ప్రజలు ఉన్న ఆస్తికి తగ్గట్టు పన్నులు చెల్లించి రసీదు పొందాలని తెలిపారు. తగ్గించి కడితే కార్పొరేషన్‌కు ఆదాయం తగ్గు తుందని, అభివద్ధి కుంటుపడుతుందని చెప్పారు. ఇటీవల 4000 ఇళ్లకు పన్నులు పెరిగాయని తెలిపారు. ఈ పెం పుదలలో హెచ్చుతగ్గులు ఉంటే సంబంధిత అధికారి దష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవచ్చని సూచి ంచారు. మోసం చేయాలని చూస్తే 100శాతం పెనాల్టీ వేయాల్సి వస్తుందని పేర్కొన్నారు. పన్ను తగ్గిస్తామని ఎవరు చెప్పినా నమ్మవద్దని కోరారు. ప్లాస్టిక్‌ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు కషి చేస్తున్నామని చెప్పారు. దీనికి ప్రజల సహకరించాలని కోరారు. ప్లాస్టిక్‌ వాడ కుండా చూసేందుకు సచివాలయ సిబ్బందిని నియ మిం చామని తెలిపారు. మురుగు కాలువల్లో ఇంటిలోని వ్యర్థాలు వేస్తే పెనాల్టీ వేస్తామని పేర్కొన్నారు. వినక పోతే కుళాయి కనెక్షన్‌ కట్‌ చేస్తామని చెప్పారు. ఇంటి లోనే తడి చెత్త పొడి చెత్త వేరు చేసి వాహనానికి ఇవ్వాల ని, లేదంటే పెనాల్టీ వేస్తామని తెలిపారు. చికెన్‌ మటన్ల వ్యర్ధాలను తీసుకువెళ్లేందుకు కాంట్రాక్టర్‌కు అప్పగిం చామని చెప్పారు. ఎవరైనా బుగ్గ వంకలో, దేవుని కడప చెరువు కెసి కెనాల్‌ లో వ్యర్ధాలు వేస్తే చర్యలు తీసుకుం టామని హెచ్చరించారు. అనుమతి లేకుండా నిర్మా ణాలు చేపడితే తొలగిస్తామని పేర్కొ న్నారు. రోడ్డుపైన నిర్మాణ పనులకు సంబంధించి మెటీరియల్‌ అడ్డంగా వేస్తే పెనాల్టీ వేస్తామని తెలిపారు. ప్రజా సమస్యల కోసం ఏర్పాటుచేసిన ఫోన్‌ నంబర్‌ను విని యోగి ంచుకోవాలని కోరారు. ప్రతి ఆదివారం రాజు పార్కు వద్ద గతంలో వలే సాంస్కతిక కార్యక్రమాలను తిరిగి ప్రారంభిస్తున్నామని తెలిపారు. మార్చి లోపు పన్నులు కట్టి కార్పొరేషన్‌ అభివద్ధికి సహకరించాలని కోరారు.

➡️