బాలుడు అనుమానస్పద మృతి

Jun 11,2024 21:36

ప్రజాశక్తి – నెల్లిమర్ల : నగర పంచాయతీ పరిధి కొండపేటలో బాలుడు అనుమాన స్పదంగా మృతి చెందాడు. మంగళవారం స్థానికులు అందించిన వివరాల ప్రకారం నగర పంచాయతీ పరిధి కొండపేటకు చెందిన కారెపు చైతన్య (15) అనే బాలుడు గ్రామ శివారు కొండపేట – కొత్తపేట రహదారి కొండ వద్ద గాయాలతో అనుమాన స్పదంగా మృతి చెందారు. కాగా గత రెండు రోజులుగా కనిపించక పోవడంతో బందువులు పరిసర ప్రాంతాల్లో వెతికారు. ఇంతలో బాలుడు అనుమానస్పద స్థితిలో విగత జీవిగా కనిపించారు. మృతిపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

➡️