ఎస్‌ జి ఎఫ్‌ క్రీడలలో ఎస్వి కళాశాల విద్యార్థులు ఎంపిక

ప్రజాశక్తి-రైల్వేకోడూరు (కడప) : పులివెందుల, మైదుకూరు, పుల్లంపేట లో జరిగిన ఎస్‌ జి ఎఫ్‌ క్రీడా పోటీలలో ఎస్‌ వి జూనియర్‌ కళాశాల విద్యార్థులు సత్తా చాటి జిల్లా జట్టుకు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్‌ ఎస్‌ ఎన్‌ శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … కబడ్డీ, కోకో, వాలీబాల్‌, సాఫ్ట్‌ బాల్‌, బేస్‌ బాల్‌, క్రికెట్‌ పోటీలకు 10 మంది విద్యార్థిని, విద్యార్థులు రాష్ట్ర స్థాయి లో పాల్గొనే కడప జిల్లా జట్టుకు ఆయా గేమ్స్‌ లో ఎంపికయ్యారని తెలిపారు. ఈ క్రీడలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా జట్టుకు ఎంపికైన విద్యార్థిని విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీనివాసులు, డైరెక్టర్‌ వసుందర, వ్యాయామ ఉపాధ్యాయులు పుల్లారావు, అధ్యాపక, అధ్యాపకేతర బృందం అభినందించారు.

➡️