గ్రామాల్లో ‘స్వచ్ఛ ఆంధ్రా-స్వచ్ఛ దివస్‌’

ప్రజాశక్తి- సంతమాగులూరు : మండల పరిధిలోని పలుగ్రామాల్లో స్వచ్ఛ ఆంధ్రా-స్వచ్ఛ దివస్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిడిఒ జ్యోతిర్మయి సంతమాగులూరులో చేపట్టిన పారిశుధ్య కార్యక్రమాలను పరిశీలించారు. అనంతరం ఎంపిడిఒ మాట్లాడుతూ ప్రతి నెలా మూడో శనివారం విధిగా నిర్వహిస్తున్న స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్‌ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. వ్యాధులను అరికట్టడానికి, ఆరోగ్యాన్ని రూపొందించుటకు పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించడానికి, మురుగునీరు పోవడానికి సైడ్‌ కాలువలు శుభ్రపరుచుట, వీధులను శుభ్రపరుచుట, చెత్త కుప్పలు తొలగించుట, గ్రామాలలోని రోడ్డులకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను తొలగించుట, అంటువ్యాధులు ప్రబలకుండా నివారణ చర్యలు చేపట్టుట, ప్లాస్టిక్‌ వ్యర్ధాల నిర్వహణ, బ్లీచింగ్‌, సున్నం నిల్వ చేసుకొనుట, దోమల నివారణకు పాకింగ్‌ లాంటి కార్యక్రమాలు గ్రామపంచాయతీ కార్యదర్శులు బాధ్యత తీసుకొని నిర్వహించాలని ఎంపిడిఒ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇఒపిఆర్‌డి శివరామ ప్రసాద్‌, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. యద్దనపూడి : మండల పరిధిలోని గ్రామాలలో స్వచ్ఛ ఆంధ్రా- స్వచ్ఛ దివస్‌ కార్యక్రమం శనివారం నిర్వహించారు.ఈ సందర్భంగా యద్దనపూడి గ్రామంలో మానవహారం నిర్వహించారు. చేశారు. ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి ప్రభాకరరావు మాట్లాడుతూ గ్రామాలలో పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన పెంచాలన్నారు. సూచించారు. ఎంపిడిఒ లక్ష్మినారాయణ మాట్లాడుతూ సీజనల్‌ వ్యాధుల పట్ల తగిన చర్యలు తీసుకోవాలన్నారు. తహశీల్దారు రవి కుమార్‌ మాట్లాడుతూ పారిశుధ్య కార్యక్రమాలలో గ్రామ ప్రజలను కూడా భాగ స్వాములు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ శ్రీహర్ష, ఎపిఒ రమేష్‌ బాబు, ఎంఇఒ గోపి, ఇఒపిఆర్‌ కష్ణ, పంచాయతీ, సచివాలయ వైద్య, ఎంఆర్‌సి సిబ్బంది పాల్గొన్నారు. కారంచేడు : మండల పరిధిలోని ఆదిపూడి గ్రామంలో స్వచ్ఛ ఆంధ్రా, స్వచ్ఛ దివస్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం గ్రామంలోని ప్రధాన రహదారుల్లో చెత్తాచెదారాన్ని తొలగించి శుభ్రపరిచారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కష్ణ, పంచాయతీ సిబ్బంది, స్థానిక నాయకులు మల్లేశ్వరరావు ,షేక్‌ రియాజ్‌, చంద్రశేఖర్‌, మాదాల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. కొల్లూరు : ప్రజలు పరిసరాల పరిశుభ్రత పాటించాలని టిడిపి మండల అధ్యక్షుడు మైన్నేని మురళీకష్ణ తెలిపారు. కొల్లూరు పంచాయతీ కార్యాలయం వద్ద స్వచ్ఛ ఆంధ్రా, స్వచ్ఛ దివస్‌ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మురళీకష్ణ మాట్లాడుతూ ప్రజలందరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. స్వచ్ఛ ఆంధ్రా కోసం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ నరసింహారావు, సర్పంచి రమావత్‌ విజయ, ఉప సర్పంచ్‌ దూళిపూడి కష్ణ, ఇఒపిఆర్‌డి సునీత పంచాయతీ కార్యదర్శి మల్లికార్జున,సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు పర్చూరు : ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ పీడీ ఎస్‌. విజయలక్ష్మి తెలిపారు. స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్‌ కార్యక్రమంలో భాగంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. సందర్భంగా పీడీ మాట్లాడుతూ ప్రతినెలా మూడో శనివారం స్వచ్ఛత కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ ప్రద్యుమ్న కుమార్‌, ఇఒఆర్‌డి కె. సత్యనారాయణ, ఎపిఒ బుల్లయ్య, పంచాయతీ కార్యదర్శి ఏ.మస్తాన్‌ రావు, బి.నాగేశ్వరరావు, కోట శ్రీనివాసరావు, పంచాయతీ సిబ్బంది, ఎన్‌ఆర్‌ఐ సిబ్బంది, వెలుగు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.చెరుకుపల్లి: మండల పరిధిలోని పలు గ్రామాల్లో స్వచ్ఛ ఆంధ్రా – స్వచ్ఛ దివస్‌ కార్యక్రమం నిర్వహించారు. మండల పరిషత్‌ కార్యాలయం వద్ద అధికారులు, ప్రజా పతినిధులు స్వచ్ఛ ఆంధ్రా-స్వచ్ఛ దివస్‌ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం చెరుకుపల్లి పంచాయతీ పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, గ్రామ పురవీధుల్లోని చెత్తను తొలగించి పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ, తహశీల్దారు పద్మావతి, ఇఒపిఆర్‌డి శీనివాసన్‌, ఎంఆర్‌కె మూర్తి, మల్లాది రామకష్ణ, దివి రాంబాబు, పంచాయతీ కార్యదర్శి విజయబాబు తదితరులు పాల్గొన్నారు. భట్టిప్రోలు : మండల పరిధిలోని గ్రామాల్లో స్వచ్ఛ ఆంధ్రా, స్వచ్ఛ దివస్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేమూరులో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. భట్టిప్రోలు మండల పరిషత్‌ కార్యాలయం వద్ద నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ ఎస్‌వి.రమణ, ఎంపిపి డివి. లలితకుమారి, జడ్‌పిటిసి ఉదయ భాస్కరి, ఎపిఎం శ్రీమన్నారాయణ, వేమూరు తహశీల్దారు సుశీల, టిడిపి నాయకులు జొన్నలగడ్డ విజయబాబు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.మేదరమెట్ల : మేదరమెట్ల గ్రామంలో స్వచ్ఛ ఆంధ్రా, స్వచ్ఛ దివన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు స్వచ్ఛ ఆంధ్రా, స్వచ్ఛ దివస్‌ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ ఆర్‌.రాజేశ్వరి,పంచాయతీ కార్యదర్శి జె.లక్ష్మీకాంత్‌, వైస్‌ సర్పంచ్‌ మన్నే దుర్గారావు , సచివాలయఉద్యోగులు,పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు

➡️