ప్రజాశక్తి-చల్లపల్లి (కృష్ణా) : స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తలు సమాజానికి స్ఫూర్తి ప్రదాతలు అని స్వచ్ఛ చల్లపల్లి కన్వీనర్ డాక్టర్ డీ.ఆర్.కే.ప్రసాద్ అన్నారు. శుక్రవారం ఉదయం స్వచ్ఛ చల్లపల్లి కార్యక్రమం జాతీయ రహదారి వద్ధ నిర్వహించారు. హైవే మలుపు, రోడ్డు, ఇరువైపులా శుభ్రం చేసి సుందరంగా మార్చారు. నూతనంగా నిర్మిస్తున్న ముఖద్వారం వద్ధ శుభ్రం చేసి పరిశుభ్రంగా మార్చారు. కార్యక్రమంలో స్వచ్ఛ సుందర చల్లపల్లి కన్వీనర్లు డాక్టర్ డీ.ఆర్.కే.ప్రసాద్ – డాక్టర్ టీ.పద్మావతి, సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి, డాక్టర్ శివప్రసాద్, గ్రామ ప్రముఖులు పైడిపాముల రాజేంద్ర, డీఆర్‌ఓ కార్యాలయ సీసీ తూము వెంకటేశ్వరరావు, విశ్రాంత పశు వైద్యులు డాక్టర్ మాలెంపాటి గోపాలకృష్ణయ్య, రిటైర్డ్ ప్రిన్సిపాల్స్ ఎన్.రామారావు, తగిరిశ సాంబశివరావు, ప్రభుత్వ ఉపాధ్యాయులు వాసుదేవరావు, సుభాషిణి, వేముల శ్రీనివాసరావు, విశ్రాంత ఉపాధ్యాయులు ప్రాతూరి ఉదయ శంకర శాస్త్రి, కే.మణి ప్రభాకర్, అడపా గురవయ్య, కోట పద్మావతి, విశ్రాంత వీఆర్‌ఓ కొర్రపాటి వీరసింహుడు, విశ్రాంత చెక్ పోస్ట్ ఉద్యోగి వెంకటేశ్వరరావు, నాదెళ్ల వేణు, లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు కస్తూరి ప్రసాద్, సత్యసాయి ధ్యాన మండలి ప్రతినిధి నాయుడు మోహనరావు, పోస్టల్ ఉద్యోగి మెండు శ్రీనివాసరావు, పినిశెట్టి నిరంజన్, విశ్రాంత ఇంజినీర్ ఏ.బీ.శంకరరావు, పల్నాటి అన్నపూర్ణ, కస్తూరి విజరు, ఆకుల దుర్గా ప్రసాద్, జాస్తి ప్రసాద్, లక్ష్మణరావు, దేసు మాధురి, మాలెంపాటి అంజియ్య, సాధనాల సతీష్, నరసింహారావు, నందేటి శ్రీను, కస్తూరి శ్రీను, జానీ, శేషు, శివకుమారి, శివపార్వతి, ప్రేమానంద్, తాతినేని రమణ, పద్మావతి హాస్పిటల్ సిబ్బంది, పెద్దసంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.