తిరుపతి : తిరుపతి జిల్లా ఏ.పీ.ఎస్.ఆర్టీసీ గూడూరు డిపో ఎదుట కండక్టర్, డ్రైవర్లు అక్రమ సస్పెన్షన్ వెంటనే రద్దు చేయాలని (సి.ఐ.టి.యు) అనుబంధం ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన కార్యక్రమం బుధవారానికి ఏడవ రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమానికి డిపో కార్యదర్శి డి.శ్రీధర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి అక్రమ సస్పెన్షన్ లను రద్దుచేసి ఉద్యోగులను విధులలోకి తీసుకోవాలని, లేనిపక్షంలో 12 వ తేది గురువారం నుండి జరిగే పోరాటాలకు యాజమాన్యం పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందని ఆయన తెలియజేశారు. అనంతరం గూడూరు పట్టణ సి.ఐ.టి.యు అధ్యక్ష,కార్యదర్శులు బి.వి రమణయ్య,యస్.సురేష్ మాట్లాడుతూ ఉద్యోగులను అక్రమ సస్పెన్షన్ లను చేసిన డిపో మేనేజర్ పై ఉన్నతాధికారులు స్పందించి వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్.డబ్ల్యూ. ఎఫ్. సభ్యులు నిరసన కార్యక్రమాలు చేపట్టి వారం రోజులు కావస్తున్నా కాలయాపన మానుకొని ఉద్యోగులను తక్షణం విధులలోకి తీసుకోవాలని సర్కులర్ 1/2019 అమలు చేయాలని కోరారు. డిపో సహాయ కార్యదర్శి కె.ఎస్.వాసులు మాట్లాడుతూ రేపటి నుండి ”రిలే నిరాహార దీక్షలు” జరుపుతామని అప్పటికి స్పందించకపోతే వంట వార్పు కార్యక్రమం కూడా డిపో వద్ద జరుగుతుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్.డబ్ల్యూ.ఎఫ్ సభ్యులు ఎస్. ఎస్.వి.కఅష్ణా, కిరణ్, రఘురాం, కత్తి సుబ్రహ్మణ్యం, రుక్మిణమ్మ, ఏ సీనయ్య, జి.వి.రమణయ్య, ఎం.గురవయ్య, పి.ఆర్.రాజు, పి. రవీంద్ర, సుధాకర్ రాజు, ఎస్. కఅష్ణయ్య, రవీంద్ర, కఅష్ణారెడ్డి, ఏ.అంకయ్య, ఎస్కే బాషా, గ్యారేజ్ సిబ్బంది భాస్కర్, నజీరుద్దీన్, సిఐటియు నాయకులు చంద్రయ్య, గుర్రం రమణయ్య, అడపాల ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
