ప్రజాశక్తి- సిఎస్‌పురం రూరల్: మండలంలోని కోవిలంపాడులో వివాదాస్పదంగా ఉన్న ఇంటి స్థలాలపై తహశీల్దార్ డి.మంజునాథరెడ్డి మంగళవారం విచారణ చేపట్టారు. కోయిలపాడు రెవెన్యూలో సర్వే నెంబరు 215/2 స్థలంలో 1987 ప్రాం తంలో కొంతమంది ముస్లిం మైనార్టీలకు ఇంటి స్థలాలు మంజూరు చేశారు. ఆ స్థలాలలో ఇటీవల కొందరు ఇల్లు నిర్మించుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బోగస్ పట్టాలు తయారు చేయించి ఇల్లు నిర్మిస్తున్నారంటూ ఓ వర్గానికి చెందిన వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో రెండు గ్రూపుల మధ్య వివాదం చోటుచేసుకుంది. ఇరువర్గాలు ఘర్షణకు దిగి పోలీస్ స్టేషన్‌లో కేసులు కూడా పెట్టుకుని ఉన్నారు. ఈ నేపథ్యంలో సమస్య పరి ష్కారం అయ్యేంతవరకు ఆ స్థలంలోకి ఎవరూ వెళ్ళవద్దం టూ అధికారులు ఇరు వర్గాలను హెచ్చరించారు. వివా దాస్పదంగా ఉన్న స్థలంలో ఒక వ్యక్తి ఇల్లు కడుతున్నారం టూ ఒక వర్గానికి చెందిన వారు గత శుక్రవారం తహశీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై తహ శీల్దార్ డి.మంజునాథరెడ్డి, ఎస్‌ఐ ఆర్.సుమన్‌లు మంగళవారం గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు. ఇరు రువర్గాల వారు రాజీకి వచ్చే అవకాశం కనిపించకపో వడంతో ఆ స్థలాన్ని ప్రభుత్వ పరం చేసుకుంటామంటూ తహశీల్దార్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో తమకు మూడు రోజులు గడువు ఇవ్వాలని ఇరువర్గాల వారు తహశీల్దార్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ షేక్ ఖాదర్ బి, షేక్ రజ్జాబ్ భాష, నాయబ్ రసూల్, ఖాదర్, వీఆర్వో తిరుపతయ్య, సర్వేయర్ జీవితలు పాల్గొన్నారు.
