ప్రజాశక్తి – రేపల్లె : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలను మున్సిపల్ కమిషనర్ కె. సాంబశివరావు, తహశీల్దారు, ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎం. శ్రీనివాసరావు మంగళవారం పరిశీలించారు. పదో వార్డులోని ప్రకాశం ఎలిమెంటరీ పాఠశాల పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. పోలింగ్‌కు ఎలాంటి అవాంతరాలు రాకుండా జాగ్రత్తగా వ్యవహ రించాలని అధికారులకు సూచించారు. పోలింగ్ కేంద్రంలో మెడికల్, లైటింగ్ ఏర్పాట్లు చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఇన్‌ఛార్జి ఆర్‌ఐ రాంబాబు, రెవెన్యూ డిజిటల్ అసిస్టెంట్లు కంప్యూటర్ ఆపరేటర్లు, సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
