ప్రజాశక్తి – పిచ్చాటూరు (తిరుపతి జిల్లా) : గ్రామీణ ప్రాంతాల్లో రైతుల రెవెన్యూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తుందని తహసీల్దార్ రమేష్ బాబు అన్నారు. మండల కేంద్రమైన పిచ్చాటూరు పంచాయతీ సచివాలయంలో మంగళవారం రెవిన్యూ సదస్సు నిర్వహించారు.సదస్సులో టీడీపీ క్లస్టర్ ఇంచార్జి డి.ఇళంగోవన్ రెడ్డి , అరణీయర్ ప్రాజెక్టు చైర్మన్ రవి రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా గ్రామాల్లో రెవిన్యూ సమస్యలు పై పరిష్కరం కోరుతు తహశీల్దార్ పిర్యాదు చేసారు.క్షేత్ర స్థాయిలో పరిశీలించి సమస్యలు పరిష్కరం చేస్తామన్నారు..అనంతరం రైతుల నుంచి అర్జీలను స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నారాయల్ పాల్గొన్నారు.