మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన అభిరుచి మధు పై చర్యలు తీసుకోండి : మనియార్‌ హనీఫ్‌ ఎస్‌డిపిఐ

నంద్యాల అర్బన్‌ : సోషల్‌ డెమొక్రటిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా నంద్యాల అసెంబ్లీ నాయకులు మనియార్‌ హనీఫ్‌ గారు మాట్లాడుతూ నిన్న నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్‌ నందు జరిగిన కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు అయిన అభిరుచి మధు అనే వ్యక్తి చాలా మూర్ఖత్వంగా ప్రవర్తిస్తూ 20 శాతం జనాభాను అంటరానివాళ్లుగా మాట్లాడుతూ వాళ్ల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించడం చాలా బాధాకరమని ఇటువంటి మతఛాందసవాదులకు సమాజంలో చోటు ఇవ్వకూడదని వీరిని పోలీస్‌ శాఖ వారు కఠినంగా కేసులు కట్టి శిక్షలు పడే విధంగా చేయాలని కోరారు. అదేవిధంగా నంద్యాల పట్టణంలో హిందూ , ముస్లిం సోదరులు దశాబ్దాలుగా కలిసిమెలిసి జీవిస్తున్నారని ఇటువంటి వాళ్ల వల్ల సమాజంలో చీలికలు వస్తాయని ఇటువంటి వారి పట్ల నంద్యాల సమాజం కూడా జాగ్రత్తగా ఉండాలని, ఇటువంటి వారి వ్యాఖ్యాలను ప్రతి ఒక్క భారతీయుడు ఖండించాలని మరియు అందరూ కలిసిమెలిసి ఉండి ఇటువంటి మూర్ఖులకు సరైన విధంగా జవాబు ఇవ్వాలని కోరారు.

➡️