ఫిజియోథెరపీని సద్వినియోగం చేసుకోండి

Nov 26,2024 18:20 #antapur

ప్రజాశక్తి – పెద్దాపురం : స్థానిక మహాత్మా గాంధీ పాఠశాల ఆవరణలోని భవిత కేంద్రంలో నిర్వహిస్తున్న ఫిజియోథెరపీని శారీరక వైకల్యం కలిగిన బాలల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని మండల విద్యాశాఖాధికారి చౌదరి అన్నారు. మంగళవారం ఆయన భవిత కేంద్రంలో నిర్వహించిన ఫిజియోథెరపీ ని పరిశీలించారు. అనంతరం ఆయన బహుధ్యా కేంద్రం నిర్వహణ, రికార్డులు పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ పెద్దాపురం మండల పరిధిలోని శారీరక వైకల్యం ఉన్న బాలల ను గుర్తించి వారి తల్లిదండ్రులకు ఈ ఫిజియోథెరపీ కేంద్రంపై అవగాహన పెంచాలన్నారు. ఈ ఫిజియోథెరపీ ద్వారా బాలలకు సత్ఫలితాలిస్తున్నందున తల్లిదండ్రులు ఈ ఫిజియోథెరపీని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమం లో ఫిజియోథెరపిస్టు డాక్టర్ అపర్ణ , ఉపాధ్యాయులు బి దుర్గాప్రసాద్ రెడ్డి, బి ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.

➡️