వేసవి శిక్షణా శిబిరాలు సద్వినియోగం చేసుకోండి

May 6,2025 18:35 #summer training

ప్రజాశక్తి – కర్నూలు జిల్లాపరిషత్ : వేసవి శిక్షణా శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పేర్కొన్నారు. టీజీవి అండ్ టీజీబి తైక్వాండో అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తైక్వాండో వేసవి శిక్షణా శిబిరానికి సంబంధించిన గోడ పత్రికను మంగళవారం ఆయన తన స్వగృహంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూల్ నగరంలో నాలుగు చోట్ల వేసవి తైక్వాండో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందనీ, వీటిలో నెల రోజులపాటు శిక్షణ ఇస్తారని, ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కొండారెడ్డి బురుజు పార్కు, పెద్ద మార్కెట్ కేఎంసి పార్క్, కర్నూల్ యునైటెడ్ క్లబ్, వెంకటరమణ కాలనీ కె ఎం సి పార్కులలో ఉదయం సాయంత్రం శిక్షణ ఇస్తామన్నారు. తైక్వాండో మాస్టర్ టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వివరాలకు 984 99 71256 నంబర్ కి ఫోన్ చేయాలన్నారు.

➡️