ఫొటో : మాట్లాడుతున్న డిఎంహెచ్‌ఒ పెంచలయ్య
ముందస్తు జాగ్రత్తలు పాటించాలి
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్ : ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రభలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని డిఎంహెచ్‌ఒ డాక్టర్ ఎం.పెంచలయ్య పేర్కొన్నారు. ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని అర్బన్ పిహెచ్‌సిలో వైద్యసిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందికి ప్రజలకు అందించాల్సిన వైద్యసేవల గురించి వివరించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా షవసరమైన చోట మెడికల్ క్యాంప్‌లు ఏర్పాటు చేయాలని, మురుగు గుంతలను గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని, చెత్తా చెదారం, ఎక్కడపడితే అక్కడ వేయకుండా మున్సిపాలిటీ వారి బండ్లకు అందించేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వసతి గృహాలను మెడికల్ అధికారి తరచుగా వెళ్లి విద్యార్థులకు వైద్యపరీక్షలు నిర్వహించాలని, అక్కడ కిటికీలకు మెష్‌లు ఏర్పాటు చేసేలా వార్డెన్‌లకు సూచించాలన్నారు. కార్యక్రమంలో అర్బన్ పిహెచ్‌సి డాక్టర్ షేక్ అస్మా, ఎంపిహెచ్‌ఇఒ సుధాకర్, ఎంపిహెచ్‌ఎస్ యు.పార్వతి, పిహెచ్‌సి కేంద్రం సిబ్బంది, ఎఎన్‌ఎంలు, ఆశాలు పాల్గొన్నారు.