ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ : అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా అసిస్టెంట్ కలెక్టర్ వినూత్న ప్రొబేషన్ పీరియడ్ లో భాగంగా శుక్రవారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఇటీవలనే పదవి బాధ్యతలు చేపట్టిన కమిషనర్ వి మల్లికార్జున్ రెడ్డి ఆమెకు శిక్షణ కాలంలో సహాయ సహకారాలు అందించనున్నారు. అసిస్టెంట్ కలెక్టర్ వినూత్న మాట్లాడుతూ … ప్రొబేషన్ పీరియడ్లో భాగంగా తాను కళ్యాణ్ దుర్గం ఆర్డీవో గా బాధ్యతలు నిర్వర్తించానన్నారు. అలాగే కూడేరు తహసిల్దార్ గా బాధ్యతలు చేపట్టానన్నారు. ప్రొబేషన్ పీరియడ్ లో భాగంగా అన్ని శాఖల పనితీరును అవగాహన చేసుకోవటానికి పని చేస్తామన్నారు. అలాగే ప్రొబేషన్ పీరియడ్ ఇంకా నాలుగు నెలల కాలం ఉండటంతో మున్సిపల్ కార్పొరేషన్ లోని పరిపాలన తీరు తన్నులు తెలుసుకుంటానన్నారు. వివిధ విభాగాల అధికారులతో చర్చించి వారి విధులు బాధ్యతలు పనితీరును తెలుసుకుంటామన్నారు. పరిపాలన కమిషనర్ గా మల్లికార్జున రెడ్డి వ్యవహరిస్తారని అన్నారు. తాను నాలుగు వారాలపాటు మున్సిపల్ కార్పొరేషన్ పనితీరును తెలుసుకోవటానికి కమిషనర్ గా వ్యవహరిస్తానని అన్నారు.
