ప్రజాశక్తి-అయినవిల్లి (కోనసీమ) : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో జరిగిన కోనసీమ బాలోత్సవములో అయినవిల్లి మండలం ముక్తేశ్వరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పతకాల పంట పండించారు. జిల్లా స్థాయిలో జరిగిన ఈ పోటీలలో జూనియర్స్ విభాగంలో స్పెల్ బి పోటీలో ప్రథమ విజేతగా సానబోయిన చరణ్, జానపద గీతాలులో ద్వితీయ విజేతలుగా యడ్ల దీవెన మోక్ష శ్రీ, .కె.లక్ష్మీ దేవి, కె .ప్రసన్నలక్ష్మి, సీనియర్స్ వ్యాసరచనలో మానేపల్లి సాయి ఆశ్రిత ద్వితీయ స్థానం, ఇంటర్నెట్ అన్వేషణలో ద్వితీయ విజేతగా పదం మంజుశ్రీ, సీనియర్ క్విజ్ లో తఅతీయ విజేతలుగా వై.జానకిరామ్ ఎం. సాయి ఆశ్రిత,ఎస్. పుష్కర్ విఘ్నేష్, సీనియర్స్ చిత్రలేఖనంలో తఅతీయ స్థానం సాధించిన పదం మణిదీప్, పి. రోహిత్ జి. యశస్వి దుర్గ విజేతలుగా మెమొంటోలు, మెడల్స్, ప్రశంసా పత్రాలు సాధించారు. వీరిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నిమ్మకాయల గణేశ్వర రావు, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ యడ్ల లక్ష్మీ దుర్గ , సిరిపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ కుడుపూడి శాంతావతి, ఉపాధ్యాయులు జి. సాయి శ్రీనివాస్, ఆర్. భాస్కరరావు, వై. ఫణి కుమార్ అభినందించారు.