టాలెంట్‌ టెస్టులో నేతాజీ విద్యార్థుల ప్రతిభ

ప్రజాశక్తి – ఆలమూరు (కోనసీమ) : ఇటీవల కడియంలో ఎన్నారై కాలేజ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన టాలెంట్‌ టెస్టులో బైపిసి పదవ తరగతి నందు మండలంలోని చెముడులంక నేతాజీ స్కూల్‌ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారని కరస్పాండెంట్‌ తుమ్మా శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. విజేతలుగా ప్రధమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులైన బడుగువానిలంకకు చెందిన సింగవరపు దుర్గా లక్ష్మీ, మడికికి చెందిన దూలం భావనలు వరుసగా నిలవగా ఎంపీసీ నందు బడుగువానిలంకకు చెందిన నేతల అఖిల్‌ ద్వితీయ స్థానంలో నిలిచాడు. దీంతో ఆయన ఆధ్వర్యంలో స్కూల్‌ లో విజేతలను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ టాలెంట్‌ టెస్ట్‌ రెండు మండలాల పరిధిలో 300 మంది 10వ తరగతి విద్యార్థులు పాల్గన్నారని తెలిపారు. ఆలమూరు, కడియం మండలాలకు చెందిన వివిధ స్కూళ్ల నుంచి విద్యార్థులను ప్రతిభ ఆధారంగా ఎంపిక చేయగా ఈ టాలెంట్‌ టెస్ట్లో వారంతా పాల్గన్నారని ఆయన తెలిపారు. ఇప్పటికే మా విద్యార్థులు నవోదయతో పాటుగా వివిధ టాలెంట్‌ టెస్టుల్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ సీట్లు సాధించడమే కాకుండా ప్రత్యేక ప్రశంస పత్రాలు, షీల్డ్‌ లు పొందారని ఆయన తెలిపారు. అలాగే విజేతలను మాజీ ఎంపిటిసి నాగిరెడ్డి వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచ్‌ నాగిరెడ్డి వెంకటరత్నం, తదితరులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై కాలేజ్‌ ప్రిన్సిపాల్‌ మురళీకఅష్ణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

➡️