ప్రజాశక్తి-రాజవొమ్మంగి (అల్లూరి) : జాతీయ స్థాయి చిత్రలేఖనం పోటీల్లో స్థానిక జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరచి 4 అవార్డులు సొంతం చేసుకున్నట్లు జిల్లా పరిషత్ పాఠశాల హెచ్‌ఎం గోపాలకృష్ణ మంగళవారం తెలిపారు. ఈ నేపథ్యంలో మంగళవారం జిల్లా పరిషత్ పాఠశాలలో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్‌ఎం గోపాలకృష్ణ మాట్లాడుతూ … ఇటీవల విజయవాడలో జరిగిన జాతీయస్థాయి చిత్రలేఖనం పోటీల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి పలువురు విద్యార్థినీ విద్యార్థులు చిత్రలేఖనం పోటీల్లో పాల్గొనగా వారిలో పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న టి.హారిక, ప్రియ ఇద్దరూ జ్యూరీ అవార్డులు, మెమొంటోలు ప్రశంసపత్రం సాధించగా, టీ కామేశ్వరి, టి.సిరివల్లి ఇద్దరూ మెరిట్ అవార్డులు ప్రశంస పత్రం అందుకున్నవారిలో ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను హెచ్‌ఎం గోపాలకృష్ణ పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు. విద్యార్థులకు బహుమతులను అందజేశారు. చిత్రలేఖనంలో మంచి తర్ఫీదు ఇచ్చి, జాతీయ స్థాయిలో, అవార్డులు సాధించి పాఠశాలకు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిన డ్రాయింగ్ ఉపాధ్యాయులు ఎం.కొండబాబును ఎంఈఓ 1కెవీ సత్యనారాయణదొర, 2 ఎంఈఓ 2 సూరారెడ్డి, హెచ్‌ఎం గోపాలకృష్ణ, సహా ఉపాధ్యాయులు అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు టీ.బొజ్జయ్య, సిహెచ్.శివకృష్ణ, చప్పా సత్యనారాయణమూర్తి, ఎం.ఉదరు, విజ్ఞేశ్వరరావు, వెంకటరమణ, పాల్ బాబు, నానాజీ, ప్రసాదరెడ్డి, ఏసు కుమారి, రేష్మ, శాంతి ప్రియ, గంగాభవాని, అప్పారావు, రాజమ్మ, జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.