పాలకొల్లు ఎన్నికల డ్యూటీలో తమిళనాడు హోం గార్డులు

పాలకొల్లు (పశ్చిమ గోదావరి) : రాష్ట్రంలో ఈనెల 13 వ తేదీన జరిగే పోలింగ్‌ కు తగిన ఎపి పోలీస్‌ సిబ్బంది లేకపోవడంతో తమిళనాడు హోం గార్డులను రప్పించారు. పాలకొల్లు నియోజకవర్గంలో 190 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా సగానికి పైగా పోలింగ్‌ కేంద్రాలకు ఎపి పోలీస్‌ సిబ్బంది లేకపోవడంతో తమిళనాడు హోం గార్డులను డ్యూటీ గా వేశారు. నాగాలాండ్‌ నుంచి వచ్చిన సిఆర్‌పిఎఫ్‌ దళాలు గత నెల రోజులుగా పాలకొల్లు ఎఎస్‌ఎన్‌ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇవిఎం స్ట్రాంగ్‌ రూం ల గస్తీ కాస్తున్నారు. నరసాపురం డివిజన్‌ లోని పలు పట్టణాలు, గ్రామాల్లో మార్చ్‌ ఫాస్ట్‌ నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలోని ఏ గ్రామంలోనైనా సమస్య ఏర్పడితే తక్షణం ప్రత్యేక టీం లు, దళాలు స్పందిస్తాయి.

➡️