ప్రజాశక్తి – కర్నూలు కార్పొరేషన్ : హజ్రత్ లతీఫ్ లౌబాలి (రహ్మత్ ఉల్లాహి అలైహి) దర్గా, మస్జిద్‌లో మార్చి 7 నుండి ప్రారంభమైన మూడు రోజుల తరావీహ్ ప్రార్థనలు, సయ్యద్ షా అబ్దుల్ లతీఫ్ లౌబాలి అలియాస్ హుస్సయినీ పీర్ సాహెబ్ పర్యవేక్షణలో, మార్చి 10, 2025న విజయవంతంగా ముగిశాయి. ఈ పవిత్ర తరావీహ్‌లో డాక్టర్ సయ్యద్ రిజ్వాన్ పాషా ఖాద్రీ, వ్యవస్థాపకులు – ఖురాన్ అకాడమీ, మూడు రోజుల్లో సంపూర్ణ ఖురాన్‌ను తిలావత్ చేశారు. ఈ ప్రత్యేక ప్రార్థనలకు అనేక మంది ముస్లింలు హాజరై, ఖురాన్ తిలావత్ చేస్తూ ప్రత్యేక దువాలను చేశారు. తదనంతరం, భక్తులు అనుచరులు డాక్టర్ సయ్యద్ రిజ్వాన్ పాషా ఖాద్రీ ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నజీర్, అమ్జద్, మసీహ్ తదితరులు పాల్గొన్నారు.
