వర్షం వల్ల పడిపోయిన ఇండ్లు – బాధితులకు టిడిపి నేత సాయం

ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : మండల పరిధిలోని తుంపెర గ్రామంలో సోమవారం రాత్రి కురిసిన వర్షం వల్ల ఇండ్లు పడిపోయిన బాధిత కుటుంబానికి తెలుగుదేశం పార్టీ నాయకులు ఆకుల బాబు మంగళవారం తుంపెర కు వెళ్లి బాధితులను పరామర్శించి ఆర్థిక సహాయం అందచేశారు. తుంపెర గ్రామంలో బీసీ కాలనీ లో సాయంత్రం కురిసిన వర్షానికి వడ్డే సంపంగి చెన్నమ్మ ఇండ్లు కూలిపోవడంతో ఆ కుటుంబాన్ని పరామర్శించి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం తెలుగుదేశం పార్టీ నాయకులు ఆకుల విజయకుమార్‌ (బాబు ) అందచేశారు.

➡️