టిడిపి నేత రాఘవరాజు మృతి

May 25,2024 20:43

ప్రజాశక్తి – గుర్ల : మండలంలోని అచ్చుతాపురం గ్రామానికి చెందిన టిడిపి సీనియర్‌ నాయకులు తిరుముల రాజు రాఘవరాజు (రాంబాబు) శనివారం ఉదయం మృతి చెందారు. గతకొంత కాలంగా ఆయన ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుమారుడు తిరుముల రాజు కిరణ్‌ కుమార్‌ తెలిపారు. బంధువులు, అభిమానులు సందర్శనార్థం పార్ధవ దేహాన్ని పెనుబర్తి జంక్షన్‌ సమీపంలో ఉన్న వారి స్వగృహంలో ఉంచుతున్నట్లు తెలిపారు. గజపతినగరం మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పల నాయుడు, చీపురుపల్లి మాజీ ఎమ్మెల్యే గద్దె బాబురావు, టిడిపి రాష్ట్ర బిసిసెల్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ వెన్నె సన్యాసి నాయుడు, టిడిపి మండల అధ్యక్షులు చనమల్ల మహేశ్వర రావు తదితరులు రాఘవరాజు పార్ధవ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. రాఘవరాజు, తన కుమారుడు కిరణ్‌కుమార్‌ రాజు గత రెండు దశాబ్దాలుగా గుర్ల మండలంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. 2014లో జరిగిన ఎన్నికలలో కిరణ్‌ కుమార్‌ సతీమణి తిరుములరాజు పద్మిని జెడ్‌పిటిసిగా గెలిపించడంలో ప్రధాన పాత్ర పోషించారు.

➡️