ప్రజాశక్తి-రైల్వేకోడూరు (రాయచోటి-అన్నమయ్య) : ఓబులవారిపల్లె మండలం చిన్నఓరంపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు 12 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సిమెంట్ రోడ్డు ను టీడీపీ ఇంచార్జ్ ముక్కా రూపానంద రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … ప్రజలకు మౌలిక వసతుల కల్పన కోసం కఅషి చేస్తామని అందులో భాగంగా నేడు చిన్న ఓరంపాడులోని జూనియర్ కళాశాలలో సిమెంట్ రోడ్డు నిర్మాణం పూర్తి చేశామని అన్నారు. ప్రతి గ్రామానికి రహదారుల నిర్మాణం కోసం సమగ్ర ప్రణాళికను సిద్ధం చేశామని, త్వరలో పనులు మొదలు పెట్టడానికి తగు ఏర్పాట్లను చేస్తున్నామని అన్నారు. జూనియర్ కళాశాలలో తరగతి గదుల కొరత ఉందని రెండు గదుల నిర్మాణం చేయించాలని కళాశాల ఉపాధ్యాయులు కొరగా రెండు కాదు, మూడు తరగతి గదుల నిర్మాణం చేయిస్తానని రూపానంద రెడ్డి హామీ ఇచ్చారు. ఇంకా ఎక్కువగా నిర్మాణం చేయిస్తానని చెప్పిన రూపానందరెడ్డికి ప్రిన్సిపాల్, విద్యార్థులు, అధ్యాపక సిబ్బంది, కఅతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్ హరిత, పిడి .శారద, క్లర్క్ శివ ప్రసాద్, సర్పంచ్ గద్దె పెంచలయ్య, జడ్పిటిసి పి.లక్ష్మీ నరసయ్య, నాగ శివ శంకర్ రెడ్డి, పయ్యావుల కోటేశ్వర్ నాయుడు, గద్దె రమేష్ బాబు, జల్లి రాజేష్, ఎన్డీఏ కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.
