మాగుంటను కలిసిన టిడిపి నాయకులు

ప్రజాశక్తి-కొనకనమిట్ల: ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డిని టిడిపి కొనకనమిట్ల మండల నాయకు లు మంగళవారం ఒంగోలులోని పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. మాగుంటను కలిసిన వారిలో టిడిపి మండల కన్వీనర్‌ మూరబోయిన బాబురావు, గొట్లగట్టు సర్పంచ్‌ పెరికె సుఖదేవ్‌, మండల నాయకులు కనకం నరసింహారావు, కోనంకి సాల్మన్‌, కిలారి బొంతయ్య, మువ్వ కాటమరాజు ఉన్నారు.

➡️