చంద్రబాబు ప్రమాణస్వీకారానికి టిడిపి శ్రేణులు

Jun 11,2024 23:49 #chandrababu, #oath, #tdp cadre
Chandrababu oath Tdp Srenulu

ప్రజాశక్తి -యంత్రాంగం పద్మనాభం : మండలంలోని పలు గ్రామాల నుంచి తెలుగుదేశం పార్టీ మాజీ మండల అధ్యక్షులు కె.నగేష్‌కుమార్‌ ఆధ్వర్యాన సుమారు 45 మంది కార్యకర్తలు, నాయకులు విజయవాడలో జరిగే చంద్రబాబు ప్రమాణస్వీకారానికి తరలి వెళ్లారు. విశాఖ కలెక్టరేట్‌ : టిడిపి జిల్లా కార్యాలయం నుంచి చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి బయలుదేరిన బస్సులను ఆ పార్టీ విశాఖ దక్షిణ నియోజకవర్గం ఇన్‌చార్జ్‌ సీతంరాజు సుధాకర్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి అరాచక పాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగిందన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. నక్కపల్లి:ఈనెల 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి కూటమి శ్రేణులు మంగళవారం తరలి వెళ్లారు. పార్టీ మండల శాఖ అధ్యక్షులు కొప్పిశెట్టి వెంకటేష్‌, నాయకులు కొప్పిశెట్టి బుజ్జి, కల్లేపల్లి బాబ్జి రాజు, మీగడ సత్తిబాబు, ప్రగడ వీరబాబు, కొంకిపూడి దొరబాబు, తోలేటి శ్రీనివాస్‌, కొప్పిశెట్టి వాసు, వంగలపూడి శ్రీను, కర్రి, వెంకట సత్యనారాయణ తదితరులు తరలి వెళ్లారు. ప్రమాణ స్వీకారోత్సవానికి తరలి వెళ్లేందుకు అధికారులు మండలానికి ఒక బస్సు కేటాయించారు. ఈ మేరకు ఎంపీడీవో శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో పలువురు వెలుగు సిబ్బంది, డ్వాక్రా మహిళలు తరలి వెళ్లారు. అనకాపల్లి : విజయవాడలో జరిగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారం మహౌత్సవానికి తెలుగుదేశం, జనసేన, బిజెపి నాయకులు మంగళవారం అనకాపల్లి పట్టణం రింగ్‌ రోడ్‌ జనసేన పార్టీ కార్యాలయం నుండి తరలి వెళ్ళారు. కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు మళ్ళ సురేంద్ర, గల్లా కొండలరావు, బుదిరెడ్డి చిన్న, మళ్ళ అమ్మాజీ, కెఎం నాయుడు, కొణతాల రమణబాబు, యల్లపు శ్రీనివాసరావు, దాడి బుజ్జి తదితరులు పాల్గొన్నారు. బుచ్చయ్యపేట : చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారానికి మండలంలోని పలు గ్రామాల నుండి తెలుగుదేశం, జనసేన, బిజెపి నాయకులు కార్యకర్తలు మంగళవారం కార్లు, బస్సుల్లో బయలుదేరి వెళ్లారు. ప్రభుత్వం అధికారికంగా ప్రతి మండలానికి ఒక బస్సును కేటాయించడంతో ద్వితీయ శ్రేణి నాయకులు ఆ బస్సులో వెళ్లారు.

➡️