పలుచోట్ల టిడిపి విజయోత్సవాలు

Jun 8,2024 23:41 #sambaralu, #TDP
Tdp Sambaralu

ప్రజాశక్తి -యంత్రాంగంఏడో వార్డులో మధురవాడ : సార్వత్రిక ఎన్నికల విజయోత్సవాలను జివిఎంసి ఏడో వార్డు పరిధిలో శనివారం టిడిపి నాయకులు నాగోతి సూర్యప్రకాశరావు ఆధ్వర్యాన నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఉన్న ఎన్‌టిఆర్‌ విగ్రహానికి పూల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆరోగ్య కేంద్రంలో ఉన్న వృద్దులకు, రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం శ్రీనివాస్‌నగర్‌లో ఉన్న శ్రీవెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి 164 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెలించుకున్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పిళ్లా వెంకట్రావు, పిళ్లా నరసింగరావు, కానూరి అచ్యుతరావు, సోంపాత్రుడు, పోతిన ప్రసాద్‌, జనసేన నాయకులు నాగోతి నరసింహనాయుడు, పిళ్లా శ్రీను, తిరుమలరావు, జగుపల్లి నాని తదితరులు పాల్గొన్నారు. భీమునిపట్నం : జివిఎంసి మూడో వార్డు బోయి వీధిలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు ఆధ్వర్యాన శనివారం విజయోత్సవం నిర్వహించారు. కేక్‌ కట్‌ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. రాష్ట్రంలో టిడిపి కూటమి అధికారంలోకి రావడం, స్థానిక ఎమ్మెల్యేగా గంటా శ్రీనివాసరావు అత్యధిక మెజారిటీతో గెలుపొందడంపై విజయోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కాసరపు నాగరాజు, ఎల్లాజీ, కొక్కిరి అప్పన్న, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.తగరపువలసలో…. జివిఎంసి ఒకటో వార్డు పరిధి తగరఫువలసలో పార్టీ వార్డు అధ్యక్షులు తమ్మిన సూరిబాబు ఆధ్వర్యాన మోటారు సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కొప్పల రమేష్‌, కృష్ణ, గరే సదానంద, డి.వెంకటేష్‌, గిడుతూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు

➡️