అనారోగ్య సమస్యతో ఉపాధ్యాయుడు ఆత్మహత్య

Jun 10,2024 21:30

 ప్రజాశక్తి – పార్వతీపురం రూరల్‌ : మండలంలోని చిన్న బొండపల్లికి చెందిన ఉపాధ్యాయుడు అనారోగ్య సమస్యలతో మనస్థాపం చెంది గ్రామ శివారులో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సోమవారం జరిగింది. గ్రామస్తుల వివరాలు మేరకు చిత్త పాపారావు (49) పెద్దబొండపల్లి పంచాయితీ దిబ్బగుడ్డివలస ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పని చేస్తున్నారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో తలెత్తిన ఆరోగ్య సమస్యల వల్ల మనస్థాపంతో ఈ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

➡️